అందుకే కోహ్లీ ఆట తీరు బాగోలేదు: ఆకాశ్ చోప్రా

  • ఎన్నడూ లేనంత‌గా రిస్క్ చేస్తున్నాడు
  • సిక్సర్‌ కొట్టే అవసరం లేకపోయినా కొడుతున్నాడు
  • కోహ్లీకి అప్ప‌ట్లో క్రమశిక్షణ ఉండేది
  • ఇప్పుడు అది కోల్పోయాడ‌న్న చోప్రా
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భార‌త బ్యాట్స్‌మ‌న్ కోహ్లీ 17 పరుగుల వద్ద ఔటైన విష‌యం తెలిసిందే. అతను అన‌వ‌స‌రంగా భారీ షాట్ల‌కు ప్ర‌య‌త్నించ‌డం కార‌ణ‌మ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీంతో అత‌డి ఆట‌తీరుపై మాజీ ఓపెనర్‌ ఆకాశ్ చోప్రా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఇంతకుముందు ఎన్నడూ లేనంత‌గా కోహ్లీ రిస్క్ చేస్తున్నాడ‌ని చోప్రా అన్నారు.

 అప్ప‌ట్లో కోహ్లీ సిక్సర్‌ కొట్టే అవసరం లేకపోతే ప్రయత్నించేవాడు కాదని తెలిపారు. అప్ప‌ట్లో కోహ్లీ సింగిల్స్‌, బౌండరీలతోనే పరుగులు చేసేవాడ‌ని, అప్ప‌ట్లో రిస్క్‌ తీసుకొని షాట్లు ఆడేవాడు కాదని చెప్పారు. ఇప్పుడు మాత్రం కోహ్లీ అలా ఆడలేకపోతున్నాడని, ఇది కాస్త ఆందోళన కలిగించే అంశమ‌ని ఆయ‌న చెప్పారు. కోహ్లీ ఆడిన భారీ షాట్ ఒక‌వేళ సిక్స్ వెళ్లిన‌ప్ప‌టికీ జ‌రిగేది ఏముంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఆ ఒక్క సిక్సర్‌తోనే మ్యాచ్‌ గెలిచేది కాదని చెప్పారు. అవ‌స‌ర‌మైన స‌మ‌యంలోనే భారీ షాట్లు ఆడితే జ‌ట్టుకు మేలు అని తెలిపారు. కోహ్లీ లాంటి ఆటగాడు కీలక సమయంలో ఔటైతే టీమిండియాపై ఆ ప్ర‌భావం ప‌డుతుంద‌ని అన్నారు. కోహ్లీకి ఉండే క్రమశిక్షణ అతడిని ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దిందని ఆయ‌న చెప్పారు. అయితే, ఇప్పుడు మాత్రం కోహ్లీ అది కోల్పోయాడని తెలిపారు.


More Telugu News