సిరిసిల్లలో బాలకృష్ణ షూటింగ్ ప్రారంభం!

  • సెట్స్ పైకి వెళ్లిన బాలకృష్ణ
  • కెరియర్ పరంగా ఇది 107వ సినిమా
  • రాయలసీమ నేపథ్యంలో సాగే కథ
  • గోపీచంద్ మలినేని దర్శకత్వం
  • కథానాయికగా శ్రుతి హాసన్
బాలకృష్ణ 107వ సినిమా షూటింగు ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ తెలంగాణ - సిరిసిల్లలో మొదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన నాయికగా శ్రుతి హాసన్ ను తీసుకున్నారు.

క్రితం ఏడాది గోపీచంద్ మలినేని 'క్రాక్' సినిమాతో హిట్ ఇచ్చాడు. ఆ సినిమా చూసిన బాలయ్య ఆయనను పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చారు. బాలయ్య ఇంతకుముందు రాయలసీమ నేపథ్యంలో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ హిట్స్ అనిపించుకున్నాయి. అందువలన అదే నేపథ్యంలో గోపీచంద్ మలినేని కథను రెడీ చేసుకున్నాడు.

'వేటపాలెం'లో జరిగిన ఒక సంఘటన చుట్టూ ఈ కథ తిరగనున్నట్టు చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. మరి ఆ అంచనాలను గోపీచంద్ మలినేని ఎంతవరకూ అందుకుంటాడనేది చూడాలి.


More Telugu News