భారత్ 54 యాప్ లను నిషేధించడంపై చైనా స్పందన

  • కొన్నాళ్లుగా చైనా యాప్ లపై భారత్ ఉక్కుపాదం
  • తాజాగా 54 యాప్ లపై వేటు
  • విదేశీ పెట్టుబడిదారులను ఒకేలా చూడాలన్న చైనా
  • పారదర్శకత ఉండాలని హితవు
భారత్ ఇటీవల భద్రతా కారణాల రీత్యా 54 చైనా యాప్ లపై నిషేధం విధించింది. దీనిపై చైనా స్పందించింది. భారత్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిపింది. చైనా సంస్థలతో సహా విదేశీ పెట్టుబడిదారులందరి పట్ల భారత్ ఒకే రీతిలో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది. కొందరిపైనే వివక్ష చూపించడం తగదని, పారదర్శక రీతిలో, సరైన పంథా అనుసరించాలని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గావో ఫెంగ్ హితవు పలికారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతం, వ్యాపార సహకారం కొరకు భారత్ దృఢమైన విధానం అవలంభిస్తుందని భావిస్తున్నామని తెలిపారు.


More Telugu News