ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై క‌మిటీ కీల‌క‌ భేటీ

  • ఏపీ సచివాలయంలో స‌మావేశం
  • తుది నిర్ణయం తీసుకోనున్న క‌మిటీ
  • అనంత‌రం ప్ర‌భుత్వానికి నివేదిక
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ అంశం వివాదాస్ప‌దంగా మారిన విష‌యం తెలిసిందే. దీనిపై చ‌ర్చించ‌డానికి ఇప్ప‌టికే ప్ర‌భుత్వం క‌మిటీ ఏర్పాటు చేసింది. ఆ క‌మిటీ ఏపీ సచివాలయంలో స‌మావేశ‌మైంది. ఏపీలో సినిమా టికెట్‌ ధరలపై ఈ స‌మావేశంలో క‌మిటీ స‌భ్యులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంత‌రం ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌నున్నారు.

ఆ క‌మిటీ స‌భ్యులు ఇప్పటికే టికెట్ల ధరల విషయంలో సినీ ప్రముఖల అభిప్రాయాలను తీసుకున్నారు. కాగా, ఈ క‌మిటీ రాష్ట్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి నేతృత్వంలో 13 మందితో ఏర్పాటైన విష‌యం విదిత‌మే. ఇందులో స‌భ్యులుగా థియేట‌ర్ల య‌జ‌మానులు కూడా ఉన్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం నుంచి ఓ గుడ్‌న్యూస్ వ‌స్తుంద‌ని సినీ హీరోలు చిరంజీవి, మ‌హేశ్ బాబు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.  


More Telugu News