మదర్సాలున్నాయిగా అక్కడ వేస్కోండి హిజాబ్.. మాకే అభ్యంతరం లేదు: ప్రజ్ఞా సింగ్ ఠాకూర్

  • ఇంట్లో సేఫ్ కానివాళ్లే వేసుకోండి
  • బయటకు వచ్చినప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు
  • హిందూ సమాజం ఉండే చోట వద్దు
  • హిందువులు మహిళలను పూజిస్తారు
  • హిజాబ్ అంటే ఓ తెర మాత్రమేనన్న ఎంపీ
స్కూళ్లలో హిజాబ్ వివాదంపై బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ స్పందించారు. ‘ఇంట్లో సురక్షితంగా లేని వాళ్లు.. ఇంట్లో సురక్షితం కాదు అనుకునేవాళ్లే హిజాబ్ ధరించాలి’ అని ఆమె అన్నారు. హిందువులు మహిళలను పూజిస్తారని, కాబట్టి బయటకు వచ్చినప్పుడు అసలు హిజాబ్ ధరించాల్సిన అవసరమే లేదని చెప్పారు.  

‘‘ఎక్కడా హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదు. మీకు మదర్సాలున్నాయి. అక్కడ మీరు హిజాబ్ వేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. హిందూ సమాజం ఉన్న చోట వాటి అవసరం లేదు’’ అని మధ్యప్రదేశ్ లోని ఓ ఆలయం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజ్ఞా సింగ్ అన్నారు.

హిజాబ్ అనేది ఓ తెర అని, ఆ తెరను కేవలం చెడు దృష్టితో చూసే వారి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే వాడాలని పేర్కొన్నారు. అయితే, మహిళలను పూజించే హిందువులు వాళ్లను కచ్చితంగా చెడు దృష్టితో చూడరని అన్నారు. 'హిజాబ్ ఇంట్లో వేస్కోండి' అంటూ సలహా ఇచ్చారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం చెలరేగుతున్న తరుణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News