'భీమ్లా నాయక్' వచ్చి 'గని'పై పడ్డట్టు అయ్యిందే!

  • 'భీమ్లా నాయక్'గా పవన్ కల్యాణ్
  • సితార బ్యానర్ పై వస్తున్న రీమేక్
  • 'గని'గా వరుణ్ తేజ్
  • బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ
పవన్ కల్యాణ్ - రానా ప్రధానమైన పాత్రలను పోషించిన 'భీమ్లా నాయక్'పై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 25వ తేదీన భారీస్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఏప్రిల్ లో రిలీజ్ చేసే ఛాన్స్ కూడా ఉందని ఒక మాట చెప్పారు.

దాంతో ఈ సినిమా ఏప్రిల్లోనే థియేటర్లకు వస్తుందనుకుని 'ఆడవాళ్లు మీకు జోహార్లు' .. 'గని' .. 'సెబాస్టియన్' వంటి చిన్న సినిమాలు ఈ నెల 25వ తేదీని ఖాయం చేసుకుని రంగంలోకి దిగాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా మారడంతో, 'భీమ్లా నాయక్' ఈ నెల 25వ తేదీనే రావడానికి రెడీ అయ్యాడు.

మారిన డేట్ల కారణంగా బాబాయ్ .. అబ్బాయ్ ల మధ్య పోటీవచ్చి పడింది. పవన్ కి గల క్రేజ్ .. సితార బ్యానర్ కి గల ఇమేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అత్యధిక థియేటర్స్ ను ఆక్రమిస్తుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనికూడా లేదు. అందువలన ఈ రెండు సినిమాల మేకర్స్ మధ్య చర్చలు నడుస్తున్నాయట. ఆఖరికి ఏం తేలుస్తారనేది చూడాలి మరి.


More Telugu News