సీఎం కేసీఆర్ కి మోదీ, చంద్రబాబు, చిరు సహా ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు
- చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలి: మోదీ
- కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు: చంద్రబాబు
- ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలి: చిరు
- నా నాయకుడు నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటాను: కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 'తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్ధిస్తున్నాను' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
'తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సదా ఆనంద ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను' అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
'గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వుండాలని, మీ లక్ష్యసాధనకి, ప్రజాసేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
'నా నాయకుడు నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటాను. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే అలవాటుగా మార్చుకున్నారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా కేసీఆర్‌కు ఉంది. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి' అని కేటీఆర్ పేర్కొన్నారు.
'పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మీ నుంచి నేను ప్రతిరోజు ఏదో ఓ కొత్త విషయం నేర్చుకుంటున్నాను. మీరో వ్యవస్థలాంటి వారు. మీరు ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను' అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు.
కేసీఆర్ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మేడారంలోని పర్యాటక శాఖ గెస్ట్‌హౌస్‌లో ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు కేక్ కట్ చేశారు. సమ్మక్క-సారలమ్మ ఆశీస్సులతో కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
కాగా, నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడానికి టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలంటూ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన మేరకు రోగులు, నిరుపేదలకు పండ్లు, ఆహారం, దుస్తులు పంపిణీ చేస్తున్నారు. నేడు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. కేసీఆర్ జీవిత చరిత్రపై విజువల్ ఎఫెక్ట్‌తో రూపొందించిన హిందీ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు.