నా తమ్ముడి ప్రాణాలకు ముప్పు ఉంది: భూమా అఖిలప్రియ

  • ఆళ్లగడ్డలో నా తండ్రి కట్టించిన బస్ షెల్టర్ ను కూల్చివేశారు
  • అడ్డుకున్న నా తమ్ముడిపై అక్రమ కేసులు పెట్టారు
  • అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానన్న అఖిల ప్రియ 
టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రాణాలకు పోలీసుల నుంచి ముప్పు ఉందని ఆమె అన్నారు. ప్రజల కోసం తమ తండ్రి భూమా నాగిరెడ్డి బస్ షెల్టర్ కట్టించారని... ఆ బస్ షెల్టర్ కూల్చివేతను తన తమ్ముడు అడ్డుకుంటే, అతనిపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.

ఎలాంటి వర్క్ ఆర్డర్ లేకుండానే ప్రజల ఆస్తి అయిన బస్ షెల్టర్ ను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతను ప్రశ్నించిన తన తమ్ముడిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తన తమ్ముడు తప్పు చేస్తే తానే పోలీసుల వద్దకు తీసుకెళ్తానని చెప్పారు.

ఆళ్లగడ్డలో అభివృద్ధి ముసుగులో అక్రమాలు జరుగుతున్నాయని అఖిలప్రియ ఆరోపించారు. ఈ అక్రమాలను సాక్ష్యాధారాల సహా నిరూపిస్తానని... నిరూపించలేకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. మరి ఇందుకు మీరు సిద్ధమేనా? అంటూ వైసీపీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. ఆళ్లగడ్డలో జరుగుతున్న అక్రమాలపై రేపు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కూల్చివేతల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని... బాధితులకు అండగా తాము నిలబడతామని అన్నారు.


More Telugu News