బోయపాటి సినిమాలో మీరా జాస్మిన్!
- 'అమ్మాయి బాగుంది' సినిమాతో పరిచయమైన మీరా జాస్మిన్
- తమిళ .. కన్నడ .. మలయాళంలోను మంచి క్రేజ్
- వివాహమైన తరువాత సినిమాలకి దూరం
- రామ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు
తెలుగు తెరపై సందడి చేసిన నిన్నటితరం కథానాయికలలో చాలామంది ఇటీవల రీ ఎంట్రీ ఇస్తున్నారు. అక్కా .. వదిన .. అమ్మ పాత్రలు చేస్తూ భారీ పారితోషికాన్నే అందుకుంటున్నారు. ముఖ్యమైన పాత్రలకి గాను సీనియర్ హీరోయిన్స్ కి ప్రాధాన్యత పెరుగుతూ ఉండటంతో, మరికొంతమంది రంగంలోకి దిగుతున్నారు. ఆ జాబితాలో మీరా జాస్మిన్ కనిపిస్తోంది.
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో కథానాయికగా మీరా జాస్మిన్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో 'అమ్మాయి బాగుంది' సినిమాతో పరిచయమైన మీరా జాస్మిన్, 'గుడుంబా శంకర్' సినిమాతో పాప్యులర్ అయింది. వివాహమైన తరువాత సినిమాలకి దూరమైనా ఆమె, ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోంది.
రామ్ హీరోగా బోయపాటి ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మీరా జాస్మిన్ ను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో ఆమె బోయపాటి దర్శకత్వంలో 'భద్ర' చేసిన సంగతి తెలిసిందే.