హోదా అంశం తొల‌గింపున‌కు బీజేపీ ఎంపీ జీవీఎల్ కార‌ణం: వైసీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌ ఆరోపణ

  • ఏపీ అభివృద్ధిని జీవీఎల్ అడ్డుకుంటున్నారు
  • అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చాలి
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ కూడా చెప్పారన్న భరత్ 
కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించడానికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావే కారణమని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. తెలుగు వ్యక్తి అయి ఉండి ఏపీ అభివృద్ధిని ఆయన అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు.

ఏపీకి జరుగుతున్న అన్యాయంపై వైసీపీ ఎంపీలందరం అనేకసార్లు మాట్లాడామని... విభజన హామీలు, హోదాను సాధించేందుకు తాము కృషి చేస్తున్నామని భరత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 2,100 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పారని తెలిపారు. ఇదే సమయంలో ఏపీలో కొత్త జాతీయ రహదార్లను నిర్మిస్తున్న కేంద్రానికి మార్గాని కృతజ్ఞతలు తెలిపారు.


More Telugu News