సంగీత పరికరంతో ప్రధాని మోదీ సందడి.. సంత్ రవిదాస్ మందిరంలో ప్రార్థనలు
- భక్తుల్లో ఒకడిగా మారిపోయిన ప్రధాని
- గురువు రవిదాస్ మందిరంలో ప్రార్థనలు
- నేడు రవిదాస్ జయంతి
ఢిల్లీలోని కరోల్ భాగ్ లో ఉన్న శ్రీ గురు రవిదాస్ విశ్రమ్ ధామ్ మందిర్ ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు సందర్శించారు. గురువు రవిదాస్ జయంతి కావడంతో ఆయన మందిరానికి విచ్చేశారు. అక్కడున్న భక్తుల్లో ఒకరిగా మారిపోయారు. భక్తులు కీర్తనలు ఆలపిస్తుంటే, మోదీ సంగీత పరికరాన్ని తీసుకుని మోగించారు.
గురు రవిదాస్ మందిరంలో మోదీ ప్రార్థనలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి విడుదలైంది. గురువు రవిదాస్ స్ఫూర్తి ప్రతీ అడుగులో, ప్రతీ పథకంలో ఉందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పంజాబ్ ఎన్నికలు వాస్తవంగా ఈ నెల 16నే జరగాల్సి ఉంది. గురువు రవిదాస్ జయంతి కావడంతో భక్తులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఎన్నికలను వాయిదా వేయాలని పంజాబ్ సర్కారు కోరింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 20వ తేదీకి పోలింగ్ ను వాయిదా వేసింది.