దుబాయ్ ఎక్స్ పోలో మూడు ఎంవోయూలు కుదుర్చుకున్న ఏపీ సర్కారు

  • దుబాయ్ ఎక్స్ పోలో ఏపీ పెవిలియన్
  • మంత్రి మేకపాటి నాయకత్వంలో పెట్టుబడుల కోసం ప్రయత్నాలు
  • ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన మూడు కంపెనీలు
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నాయకత్వంలోని ఏపీ బృందం దుబాయ్ ఎక్స్ పో-2020లో విజయవంతమైంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలన్న ఉద్దేశంతో దుబాయ్ పారిశ్రామిక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ అనుకున్నది సాధించింది. మంత్రి మేకపాటి ఆధ్వర్యంలోని ఏపీ బృందం మూడు ఎంవోయూలు కుదుర్చుకుంది.

  • లండన్ సంస్థ కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో రూ.3 వేల కోట్ల ఒప్పందం.
  • రూ.150 కోట్ల విలువైన 25 రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు రీజెన్సీ గ్రూప్ తో ఎంవోయూ.
  • ట్రోయో జనరల్ ట్రేడింగ్ సంస్థతో బీ2బీ తరహా ఒప్పందం.
మంత్రి సమక్షంలో ఏపీ అధికారులతో ఆయా సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.


More Telugu News