60 ఏళ్ల కేరళ కూలీ ఇప్పుడో ఫ్యాషన్ మోడల్!
- కోజికోడ్ జిల్లాకు చెందిన మమ్మిక్కా ఓ రోజు కూలీ
- ఓ ఫొటోగ్రాఫర్ దృష్టిలో పడిన వైనం
- సూటు బూటు, సన్ గ్లాసులతో అదిరిపోయేలా ఫొటోషూట్
- వైరల్ అయిన ఫొటోలు
కేరళకు చెందిన మమ్మిక్కా ఓ రోజువారీ కూలీ. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబ నేపథ్యం కావడంతో ఏ పని దొరికితే అది చేసేవాడు. అయితే, 60 ఏళ్ల మమ్మిక్కా ఇప్పుడో ఫ్యాషన్ మోడల్ అయ్యాడు. కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన మమ్మిక్కా ఒకప్పుడు లుంగీ, చొక్కాతో దర్శనమిస్తే, ఇప్పుడు సూటు బూటు, సన్ గ్లాసులతో స్టయిల్ కు పర్యాయపదంలా మారాడు.
ఇటీవల షరీక్ వయలిల్ అనే ఫొటోగ్రాఫర్ మమ్మిక్కా ఫొటోలను తీసి ఆన్ లైన్ లో పోస్ట్ చేయడంతో, అవి కాస్తా వైరల్ అయ్యాయి. అంతే.. మమ్మిక్కా ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఫొటోగ్రాఫర్ షరీక్ వయలిల్ కు ఓ వెడ్డింగ్ సూట్ కంపెనీ కూడా ఉంది. దాంతో, తన కంపెనీ రూపొందించే పెళ్లి సూట్లకు మోడలింగ్ చేయాలంటూ మమ్మిక్కాకు షరీక్ ఆఫర్ ఇచ్చాడు.
అంతకుముందు, మమ్మిక్కా మోడల్ గా మారిన వైనాన్ని ఓ మేకోవర్ వీడియో రూపంలో పంచుకోగా, అది కూడా నెటిజన్లును విశేషంగా ఆకట్టుకుంది. క్లాసిక్ బ్లేజర్, ట్రౌజర్స్ తో చేతిలో ఐపాడ్, కళ్లకు సన్ గ్లాసులతో మమ్మిక్కా స్టయిల్ చూసి తీరాల్సిందే! ఓ సాధారణ కూలీ మోడల్ గా మారడం పట్ల నెటిజన్లు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. మోడలింగ్ రంగంలో మరింత ఎదగాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.