ప్రభాస్ జోడీగా 'పెళ్లి సందD' బ్యూటీ!
- 'పెళ్లి సందD'తో శ్రీలీల పరిచయం
- గ్లామర్ పరంగా మంచి మార్కులు
- 'ధమాకా' సినిమాతో బిజీ
- మారుతికి గ్రీన్ సిగ్నల్
ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో శ్రీలీల ఒకరు. 'పెళ్లి సందD' సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా గ్లామర్ పరంగా ఈ సుందరి మంచి మార్కులు దక్కించుకుంది. ఆ గ్లామర్ తోనే అవకాశాలను అందుకుంటోంది.
రోషన్ వంటి యంగ్ హీరోతో ఆడిపాడిన శ్రీలీల, ఆ తరువాత సినిమానే సీనియర్ స్టార్ హీరో అయిన రవితేజ సరసన చేస్తుండటం విశేషం. 'ధమాకా' టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ప్రభాస్ సినిమాలో ఆమె ఛాన్స్ కొట్టేసినట్టుగా చెప్పుకుంటున్నారు. మారుతి ఒక కథను చెప్పి ప్రభాస్ తో ఓకే చెప్పించుకున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి.
'రాజా డీలక్స్' టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుందనే టాక్ వచ్చింది. మారుతి కూడా ఈ వార్తను ఖండించకుండా వెయిట్ చేయమని చెప్పాడు. ఈ సినిమాలో నాయిక కోసం ఆయన శ్రీలీలను ఎంపిక చేశాడని అంటున్నారు. అయితే ఈ సినిమాకి ముందు ప్రభాస్ 'స్పిరిట్' సినిమాను పూర్తిచేయవలసి ఉంటుంది.