అమితాబ్ బచ్చన్ ను కలిసిన పవన్ కల్యాణ్
- రామోజీ ఫిల్మ్ సిటీలో అమితాబ్ తో భేటీ
- మర్యాదపూర్వకంగానే కలిసినట్టు సమాచారం
- 'ప్రాజెక్ట్ కే' షూటింగ్ కోసం హైదరాబాదులో ఉన్న అమితాబ్
బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగులో పాల్గొంటున్న అమితాబ్ వద్దకు పవన్ వెళ్లారు. మర్యాద పూర్వకంగానే ఆయనను జనసేనాని కలిసినట్టు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అమితాబ్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ కే' చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. షూటింగ్ కోసం ఆయన హైదరాబాదులో ఉన్నారు.