పాండ్యాను బ్యాటింగ్ వీరుడిగానే చూస్తున్నాం: గుజరాత్ టైటాన్స్

  • బౌలింగ్ చేస్తే మంచిది
  • బ్యాటింగ్ తో అదరగొట్టినా సంతోషమే
  • గుజరాత్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన హార్ధిక్ పాండ్యా.. కొత్తగా ఏర్పాటైన ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. నిజానికి అటు బ్యాట్ తోనూ, ఇటు బౌలింగ్ తోనూ మంచి ఫలితాలను రాబట్టగల సామర్థ్యం పాండ్యాకు ఉంది. కానీ చాలా కాలంగా అతడు బౌలింగ్ కు దూరంగా ఉన్నాడు. గాయాల కారణంగా ఐపీఎల్ 2021లో బౌలింగ్ చేయలేదు. టీ20 వరల్డ్ కప్ లోనూ కేవలం నాలుగు ఓవర్ల పాటే బౌలింగ్ చేశాడు.

దీనిపై గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. రానున్న సీజన్ కు పాండ్యాను అచ్చమైన బ్యాటర్ గానే చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. ‘‘అతడు బౌలింగ్ చేస్తే ఎంతో బాగుంటుంది. కానీ, నిజాయతీగా చెప్పాలంటే హార్ధిక్ పాండ్యా అచ్చమైన్ బ్యాటర్ గానే ఉండాలనుకుంటున్నాం. అతడు కేవలం బ్యాటింగ్ కే సరిపోతే అది మాకు సంతోషమే" అన్నారు. రూ.15 కోట్లతో పాండ్యాను కెప్టెన్ గా గుజరాత్ టైటాన్స్ తీసుకోవడం తెలిసిందే.


More Telugu News