త్రివిక్రమ్, మహేశ్ మూవీలో మోహన్ లాల్!
- విలక్షణ నటుడిగా మోహన్ లాల్ కి పేరు
- పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు
- మలయాళంలో ఇప్పటికీ తగ్గని మార్కెట్
- మహేశ్ మూవీలో ముఖ్యమంత్రి పాత్ర
మలయాళ సూపర్ స్టార్ గా మోహన్ లాల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మలయాళ సినిమాల స్థాయిని పెంచిన హీరోగా .. వైవిధ్యభరితమైన చిత్రాల కథానాయకుడిగా అక్కడ ఆయనకి మంచి పేరు ఉంది. ఎంతమాత్రం గ్యాప్ లేకుండా మలయాళ సినిమాలు చేస్తూ వెళ్లే ఆయన, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇతర భాషల్లోను నటిస్తుంటారు.
అలా చాలా కాలం క్రితమే తెలుగులో 'గాండీవం' చేసిన ఆయన, ఆ తరువాత 'మనమంతా' .. 'జనతా గ్యారేజ్' సినిమాలు చేశారు. 'జనతా గ్యారేజ్' ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. మహేశ్ బాబు సినిమా కోసం ఆయనను త్రివిక్రమ్ ఎంపిక చేసినట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.
త్రివిక్రమ్ తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉందనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర కీలకమైనది కావడంతో, ఆ పాత్రకి మోహన్ లాల్ వలన ఒక నిండుదనం వస్తుందని భావించి ఆయనను తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. పూజ హెగ్డే కథానాయికగా కనిపించనున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.