ప్రేమను నిలబెట్టుకోవడం పార్కులో నడిచినంత సులభం కాదు.. రామ్ చరణ్ తో దాంపత్య జీవితంపై ఉపాసన ఆసక్తికర సందేశం.. వీడియో పోస్ట్
- వివాహమంటే మంచి ఆరోగ్యం లాంటిది
- ఎల్లప్పుడూ శ్రద్ధగా కాపాడుకోవాలి
- భూమ్మీది ఇద్దరు వ్యక్తులు కలిసి తీర్చిదిద్దుకోవడంపైనే దాంపత్యం ఆధారపడి ఉంటుంది
- చెర్రీతో కలిసి ఉన్న ఆనంద క్షణాలను పంచుకున్న ఉపాసన
ప్రేమ, పెళ్లి గురించి రామ్ చరణ్ శ్రీమతి ఉపాసన ఆసక్తికర విషయాలను చెప్పారు. వాలెంటైన్స్ డే సందర్భంగా తమ దాంపత్య జీవితం గురించి అభిమానులు, నెటిజన్లతో పంచుకున్నారు. దాంపత్య జీవితం కలకాలం పచ్చగా ఉండాలంటే ఏం చేయాలో సూచనలిచ్చారు. ప్రేమలో పడడం సులభమేనని, అయితే, ఆ ప్రేమను నిలబెట్టుకోవడం మాత్రం పార్కులో నడిచినంత సులభం కాదని పేర్కొన్నారు. తమ పెళ్లయి పదేళ్లయిందని, వాలెంటైన్స్ డే అంటే తమకు ఎంతో ప్రత్యేకమని అన్నారు.
వివాహమంటే మంచి ఆరోగ్యం లాంటిదని, దానిని ఎల్లప్పుడూ శ్రద్ధగా కాపాడుకోవాలని ఆమె సూచించారు. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవాలని, శ్రద్ధగా ఉండాలని, లేదంటే ఎల్లకాలం నిలవదని చెప్పారు. వివాహబంధం దృఢంగా, సక్సెస్ ఫుల్ గా కొనసాగాలంటే నిత్యం శ్రద్ధ చూపించాల్సిందేనన్నారు. దంపతులిద్దరు కలిసి మంచి సమయాన్ని గడపాలని, కలిసి టీవీ చూడాలని, కలిసి భోజనం చేయాలని, కబుర్లు చెప్పుకోవాలని చెప్పారు. అలా చేస్తే దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుందని అన్నారు.
చాలా మంది పిల్లలు, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించే ఆలోచిస్తూ ఉంటారని, అతికొద్ది మంది మాత్రమే దాంపత్య జీవితం అనే ఆరోగ్యంపై శ్రద్ధపెడతారని ఉపాసన అన్నారు. పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయిస్తుంటారని చెబుతుంటారని, అయితే, తాను దానిని నమ్మనని అన్నారు. భూమి మీద ఇద్దరు వ్యక్తులు కలిసి తీర్చిదిద్దుకోవడం మీదే దాంపత్య జీవితం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
దాంపత్య జీవితం బాగుండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా దంపతులే శ్రద్ధ తీసుకోవాలని ఆమె సూచించారు. దాంపత్య జీవితం ఎలా ఉండాలన్నది దంపతులే నిర్ణయించుకోవాలన్నారు. ఒకరినొకరు ఎలాంటి భేషజాల్లేకుండా అంగీకరించడం, పరస్పర గౌరవం, స్వచ్ఛమైన ప్రేమను పంచుకోవడం వల్లే దాంపత్యం సుఖంగా కలకాలం సాగుతుందన్నారు.