పంజాబ్ సీఎం చన్నీ హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరణ

  • మోదీ పర్యటన నేపథ్యంలో చండీఘడ్ లో నోఫ్లై జోన్ విధించిన విమానయానశాఖ
  • రాహుల్ హెలికాప్టర్ కు మాత్రం అనుమతి
  • జలంధర్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన మోదీ
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ హెలికాప్టర్ కు విమానయానశాఖ అధికారులు అనుమతి నిరాకరించారు. చండీఘడ్ లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అక్కడ నో ఫ్లై జోన్ విధించారు. దీంతో చరణ్ జిత్ సింగ్ హెలికాప్టర్ టేకాఫ్ తీసుకోవడానికి అధికారులు అనుమతి నిరాకరించారు.

హోషియార్ పూర్ లో రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలో చరణ్ జిత్ పాల్గొనాల్సి ఉంది. దీంతో ఆయన చండీఘడ్ నుంచి హోషియార్ పూర్ కు హెలికాప్టర్ లో బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. అధికారులు అనుమతి నిరాకరించడంతో ఆయన ఆగిపోయారు.

మరోవైపు రాహుల్ గాంధీ హెలికాప్టర్ హోహియార్ పూర్ కు వెళ్లడానికి అనుమతించారు. చన్నీ హెలికాప్టర్ కు అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇంకోవైపు జలంధర్ లో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు.


More Telugu News