'మానాడు' రీమేకులో రానా ఖాయమైనట్టే!

  • కోలీవుడ్ లో హిట్ కొట్టిన 'మానాడు'
  • లైన్లో పడిపోయిన శింబు
  • రీమేక్ రైట్స్ సురేశ్ ప్రొడక్షన్స్ చేతికి
  • తెలుగులోను డైరెక్టర్ వెంకట్ ప్రభునే
తమిళంలో ఈ మధ్య కాలంలో భారీ విజయాలను అందుకున్న సినిమాల జాబితాలో 'మానాడు' ఒకటిగా కనిపిస్తుంది. వి హౌస్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథానాయకుడిగా శింబు - ప్రతి నాయకుడిగా ఎస్.జె. సూర్య ప్రధానమైన పాత్రలను పోషించారు.

విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా, అక్కడి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. కెరియర్ పరంగా శింబూకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చిన సినిమా ఇది. ఎస్.జె. సూర్య విలనిజానికి మంచి మార్కులు పడ్డాయి. తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు కూడా.

అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్ ను సురేశ్ ప్రొడక్షన్స్ వారు తీసుకోవడంతో, తెలుగు డబ్బింగ్ ఆపేశారు. ఇప్పుడు ఈ సినిమాలో ఒక ప్రధానమైన పాత్రను రానా చేయనున్నాడనే టాక్ బయటికి వచ్చింది. మరో పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. తెలుగులో కూడా ఈ సినిమాను వెంకట్ ప్రభునే డైరెక్ట్ చేయనున్నాడని అంటున్నారు.


More Telugu News