దీప్తితో విడిపోవడానికి వెనకున్న కారణాన్ని బయటపెట్టిన షణ్ముఖ్
- దీప్తితో విడిపోవడానికి సిరి కారణం కాదు
- సిరి వాళ్లమ్మ హౌస్‌లో అన్న మాటలు నన్ను బాధించాయి
- సిరితో చనువుగా ఉండడంతో నాపై వ్యతిరేకత పెరిగింది
- దీప్తి సంతోషంగా ఉండాలనే బ్రేకప్
- మళ్లీ మేమిద్దరం కలుస్తామో? లేదో? తెలియదు
దీప్తి సునయనతో తానెందుకు విడిపోవాల్సి వచ్చిందన్న విషయాన్ని ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్-5 కంటెస్టెంట్ షణ్ముఖ్ బయటపెట్టాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షణ్ముఖ్ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించాడు.
దీప్తితో బ్రేకప్‌కు సిరి కారణం కాదని పేర్కొన్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు సిరితో చనువుగా ఉన్నానని, నెటిజన్లలో తనపై వ్యతిరేకత పెరగడానికి అదే కారణమని తాను అనుకుంటున్నానని చెప్పాడు. అప్పటికే తాను దీప్తితోను, శ్రీహాన్‌తో సిరి రిలేషన్‌లో ఉన్నామని గుర్తు చేశాడు. ఈ క్రమంలో సిరితో కాస్త చనువు పెరగడంతో అందరిలోనూ తమపై వ్యతిరేకత పెరిగిందని అన్నాడు.
తన వల్ల దీప్తి నెగిటివిటీని ఎదుర్కొందని షణ్ముఖ్ పేర్కొన్నాడు. నెటిజన్లు తనను ట్రోల్ చేస్తున్నప్పుడు కూడా దీప్తి తననే సపోర్ట్ చేసిందని గుర్తు చేశాడు. సిరితో తాను చనువుగా ఉండడం నెటిజన్లకు ఎలా నచ్చలేదో, దీప్తి కుటుంబ సభ్యులకు కూడా అలాగే నచ్చలేదన్నాడు.
తన విషయంలో అందరి నుంచి దీప్తి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని, తను సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చిందని అన్నాడు. ప్రస్తుతానికి తామిద్దం కెరియర్‌పైనే దృష్టిపెట్టామని, మళ్లీ తాము కలుస్తామా? లేదా? అన్నిది దేవుడి చేతుల్లో ఉందని షణ్ముఖ్ పేర్కొన్నాడు. అయితే, తమ బ్రేకప్‌కు సిరి ఎంతమాత్రమూ కారణం కాదని స్పష్టం చేశాడు.
నిజానికి మూడీగా ఉండే తన లాంటి వ్యక్తికి బిగ్‌బాస్ లాంటి రియాలిటీ షో సెట్ కాదని, ప్రేక్షకుల నుంచి గుర్తింపు తెచ్చుకోవాలనే అందులో పాల్గొన్నట్టు చెప్పాడు. ఓసారి హౌస్‌లోకి వచ్చిన సిరి వాళ్లమ్మ తనను అన్న మాటలు కూడా చాలా బాధించాయని అన్నాడు. షణ్ముఖ్ ప్రతిసారి తమ అమ్మాయి సిరిని హగ్ చేసుకోవడం తనకు నచ్చలేదని ఇంటి సభ్యులందరి ముందు చెప్పారని, ఆమె అలా అనడం తనకు నచ్చలేదని చెప్పుకొచ్చాడు. ఆ మాటలు తనను ఎంతగానో బాధించాయన్నాడు.
ఇంటి సభ్యులు సిరిని ఎమైనా అంటే తాను అండగా ఉండేవాడినని, కానీ అవన్నీ వదిలేసి సిరి వాళ్లమ్మ తనను తప్పుగా అర్థం చేసుకోవడం బాధించిందని పేర్కొన్నాడు. దీప్తితో బ్రేకప్ విషయంలో సిరిని నిందించడం సరికాదని, ఆ విషయంలో తప్పు తనదే కాబట్టి ఏమైనా అంటే తననే అనాలని షణ్ముఖ్ పేర్కొన్నాడు.