మతపరమైన సెంటిమెంట్లను మేం గౌరవిస్తాం: హిజాబ్ వివాదంపై నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు
- రాష్ట్రంలో హిజాబ్ ఒక సమస్యే కాదు
- అదొక పనికిమాలిన వ్యవహారం
- ప్రభుత్వానికి అందరూ సమానమే
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన కర్ణాటక హిజాబ్ వివాదంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో హిజాబ్ అనేది ఒక సమస్యే కాదని స్ఫష్టం చేశారు. మతపరమైన సెంటిమెంట్లను తాము గౌరవిస్తామన్నారు. అసలు బీహార్‌లో హిజాబ్ అనేది సమస్యే కాదని, దీనిపై మాట్లాడాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఇదంతా పనికిమాలిన వ్యవహారమని, దాని గురించి పట్టించుకోబోమని తేల్చి చెప్పారు.
బీహార్‌లోని పిల్లలంతా యూనిఫాం ధరించే స్కూలుకు వస్తారని, ఎవరైనా తమ తలపై ఏదైనా ధరించి వచ్చినా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. అసలు అలాంటి వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని, ప్రభుత్వానికి అందరూ సమానమేనని నితీశ్ కుమార్ పేర్కొన్నారు.