రేపటి నుంచి సహాయ నిరాకరణకు వెళ్లాలని ఏపీ జెన్ కో ఉద్యోగుల నిర్ణయం

  • జనవరి నెల వేతనాలు చెల్లించలేదంటున్న ఉద్యోగులు
  • ఇంధనశాఖ కార్యదర్శికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ లేఖ
  • వేతనాలు చెల్లించాలని స్పష్టీకరణ
జనవరి నెల వేతనాలు, పెన్షన్లు ఇంకా చెల్లించలేదంటూ ఏపీ జెన్ కో ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, వేతనాలు, పెన్షన్లు చెల్లించాలని కోరుతూ రేపటి నుంచి సహాయ నిరాకరణకు వెళ్లాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర  ఇంధన శాఖ కార్యదర్శికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ లేఖ రాసింది. రేపటి నుంచి జెన్ కో సంస్థల్లో సహాయ నిరాకరణ చేపడుతున్నట్టు వెల్లడించింది. వేతనాలు చెల్లించే వరకు సహాయ నిరాకరణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.


More Telugu News