విజిల్ మహాలక్ష్మిగా కృతిశెట్టి ఫస్టు లుక్!

  • లింగుసామి నుంచి 'ది వారియర్'
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్
  • మాస్ కంటెంట్ తో నడిచే కథ  
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ   
కృతిశెట్టి వరుస సినిమాలతో .. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన కృతి శెట్టి, ఆ తరువాత సినిమాలను పూర్తిచేసే పనిలో ఉంది. ఆమె తాజా చిత్రంగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత ఆమె చేస్తున్న సినిమానే 'ది వారియర్'.

లింగుసామి దర్శకత్వంలో రామ్ హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి కృతి శెట్టి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

చెక్స్ షర్ట్ .. జీన్స్ ధరించి స్కూటర్ పై వెళుతూ ట్రెండీ లుక్ తో కృతి శెట్టి ఆకట్టుకుంటోంది. ఆమె పాత్ర పేరు 'విజిల్ మహాలక్ష్మి' అని పరిచయం చేశారు. మాస్ కంటెంట్ పుష్కలంగా ఉండేలా చూసుకుని మరీ రామ్ ఈ సినిమా చేస్తున్నాడు. తన కెరియర్లో ఫస్టు టైమ్ ఆయన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడనే విషయం తెలిసిందే.


More Telugu News