కేసీఆర్, స్టాలిన్ లకు మమత ఫోన్

  • బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు దిశగా అడుగులు
  • కాంగ్రెస్ లేకుండానే ముందుకెళ్తామన్న మమత
  • చేతులు కలపాలని సీపీఎంను కూడా అడిగామని వెల్లడి  
దేశ రాజకీయాల్లో ఆసక్తికర మలుపులు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండానే కూటమి ఏర్పడే లక్షణాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లకు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, దేశ ప్రయోజనాల కోసం తమతో చేతులు కలపాలని సీపీఎంను కూడా అడిగామని చెప్పారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా ద్వేషం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండానే ముందుకెళ్తామని చెప్పారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేయకపోవడానికి గల కారణాన్ని ఆమె వివరించారు. సమాజ్ వాదీ పార్టీని, ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ను బలహీనపరచరాదనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పారు. యూపీలో ఈసారి సమాజ్ వాదీ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు.


More Telugu News