జగన్ గారూ, సినిమా టికెట్ ధరలు తగ్గేదేలే అన్నారట.. నిజమా?: వర్ల రామయ్య
- పేదలు కూడా పెద్ద సినిమాలు చూడాలని టికెట్ ధరలు తగ్గించారు
- సినిమా పెద్దలను కలిసిన తర్వాత అంత మార్పా సార్?
- ఏమిటీ మతలబు?
సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య సెటైర్ వేశారు. పేదవానికి కూడా పెద్ద సినిమాలు అందుబాటులో ఉండాలంటూ, రాష్ట్రమంతా టికెట్ ధరలను తగ్గించిన సీఎం గారూ... ఇటీవల సినిమా పెద్దలు కొందరిని పిలిపించుకుని, వారితో మంతనాలు జరిపి, సినిమా టికెట్ ధరలు తగ్గేదేలే అన్నారట... నిజమా? ఏమిటీ మతలబు? ఇంతలోనే అంత మార్పా సార్? అని ప్రశ్నించారు.
ఇటీవల చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ వంటి సినీ ప్రముఖులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తమ సమస్యల పట్ల సీఎం సానుకూలంగా స్పందించారని భేటీ తర్వాత సినీ ప్రముఖులు తెలిపారు.