రఘురామకృష్ణ రాజుపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో స్టే విధించిన హైకోర్టు

  • చింతలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
  • సీఐడీ డీజీ సునీల్ బంధువు కేసు పెట్టారన్న రఘురాజు లాయర్
  • సాక్ష్యాధారాలు లేకుండానే కేసు పెట్టారని కోర్టుకు తెలిపిన వైనం
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఎస్సీలను రఘురాజు కులం పేరుతో దూషించారంటూ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్ బంధువు తనపై ఈ కేసును పెట్టారంటూ హైకోర్టు దృష్టికి రఘురామ తీసుకెళ్లారు.

రఘురాజు ఎలాంటి దూషణలు చేయకపోయినా కేసు నమోదు చేశారని ఆయన లాయర్ వెంకటేశ్ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలు లేకుండానే కేసు నమోదు చేశారని చెప్పారు. వాదనలను విన్న హైకోర్టు తదనంతర చర్యలపై స్టే విధించింది. అంతేకాదు, ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేయాలని హైకోర్టును ఆదేశించింది.


More Telugu News