ప్రత్యేకహోదా అంశాన్ని మొదట ప్రస్తావించింది మేమే: జీవీఎల్ నరసింహారావు

  • కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసిన జీవీఎల్
  • సబ్ కమిటీ అజెండాలో అంశాల తొలగింపుపై ప్రకటన చేయాలని కోరిన వైనం
  • నాలుగు అంశాలను పొరపాటున అజెండాలో పెట్టారన్న జీవీఎల్
ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని తొలుత ప్రస్తావించింది బీజేపీనే అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆ సమయంలో టీడీపీ, వైసీపీ నేతలు నిద్రపోతున్నారని విమర్శించారు. ఏపీ విభజన చట్టం పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ అజెండాలో తొలుత ప్రత్యేకహోదా అంశాన్ని పెట్టినప్పటికీ ఆ తర్వాత తొలగించారు.

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు జీవీఎల్ లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ సబ్ కమిటీ సమావేశ అజెండా నుంచి ప్రత్యేకహోదాతో పాటు కొన్ని అంశాల తొలగింపుపై ప్రకటన విడుదల చేయాలని లేఖలో కోరారు. అజెండాలో పెట్టాల్సిన అంశాలను అధ్యయనం చేయడానికి మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. విభజన చట్టానికి సంబంధం లేని నాలుగు అంశాలను పొరపాటున అజెండాలో పెట్టారని... ఏపీకి మాత్రమే సంబంధించిన అంశాలను మనం మాట్లాడుకుంటే సరిపోతుందని చెప్పారు.


More Telugu News