హిజాబ్ ధరించనందువల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి: తీవ్ర వ్యాఖ్యలు చేసిన కర్ణాటక ఎమ్మెల్యే
- కర్ణాటకలో హిజాబ్ వివాదం
- దేశంలో అత్యాచారాల రేటుపై ఎమ్మెల్యే జమీర్ వ్యాఖ్యలు
- హిజాబ్ అమ్మాయిల సౌందర్యాన్ని దాచి ఉంచుతుందని వెల్లడి
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ధరించకపోవడం వల్లే దేశంలో అత్యాచారాల రేటు ఎక్కువగా ఉందని అన్నారు.
"ఇస్లాం పరిభాషలో 'హిజాబ్' అంటే 'తెర' అని అర్థం. ఓ వయసుకు వచ్చిన తర్వాత అమ్మాయిల సౌందర్యాన్ని ఈ హిజాబ్ దాచి ఉంచుతుంది. మహిళలు హిజాబ్ ధరించనప్పుడు వారు అత్యాచారాలకు గురవుతున్నారు.. దేశంలో అత్యాచారాలు ఎక్కువగా జరుగుతుండడానికి కారణం ఇదే!" అని జమీర్ అహ్మద్ సూత్రీకరించారు.
అయితే హిజాబ్ ధరించడం తప్పనిసరి ఏమీ కాదని, ఎవరైతే తమను తాము కాపాడుకోవాలనుకుంటున్నారో వాళ్లు హిజాబ్ ధరించవచ్చని కూడా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదేనని అభిప్రాయపడ్డారు.