ఐపీఎల్ వేలంలో అదిరిపోయే ధర పలికింది వీళ్లకే!

ఐపీఎల్ వేలంలో అదిరిపోయే ధర పలికింది వీళ్లకే!
  • ముగిసిన ఐపీఎల్ వేలం
  • టీమిండియా ఆటగాళ్లకు భారీ ధర
  • పోటీలు పడిన ఫ్రాంచైజీలు
  • ఈసారి ఇషాన్ కిషన్ కు రికార్డు ధర
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ కోసం నిర్వహించిన మెగా వేలం ముగిసింది. గత సీజన్లతో పోల్చితే ఈసారి భారత ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. విదేశీ ఆటగాళ్ల కంటే టీమిండియా ఆటగాళ్లపైనే అధికంగా కాసుల వర్షం కురిపించాయి. టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ ఈసారి వేలంలో అత్యధిక ధర పొందాడు. ఇషాన్ కిషన్ ను ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది.

ఆటగాళ్ల జాబితా...

  • ఇషాన్ కిషన్- రూ.15.25 కోట్లు (ముంబయి ఇండియన్స్)
  • దీపక్ చహర్- రూ.14 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
  • శ్రేయాస్ అయ్యర్- రూ.12.25 కోట్లు (కోల్ కతా నైట్ రైడర్స్)
  • లియామ్ లివింగ్ స్టోన్- రూ.11.50 కోట్లు (పంజాబ్ కింగ్స్)
  • శార్దూల్ ఠాకూర్- రూ.10.75 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
  • హర్షల్ పటేల్- రూ.10.75 కోట్లు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
  • వనిందు హసరంగ- రూ.10.75 కోట్లు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
  • నికోలాస్ పూరన్- రూ.10.75 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
  • లాకీ ఫెర్గుసన్- రూ.10 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • ప్రసిద్ధ్ కృష్ణ- రూ.10 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
  • ఆవేశ్ ఖాన్- రూ.10 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)



More Telugu News