దళితుల కోసమే కొత్త రాజ్యాంగం కావాలంటున్నా... వద్దంటారా?: సీఎం కేసీఆర్

  • కేంద్రంపై సీఎం కేసీఆర్ ఆగ్రహావేశాలు
  • ప్రగతి భవన్ లో మీడియా సమావేశం
  • దళిత సంఘాలకు, రాజ్యాంగానికి సంబంధమేంటన్న కేసీఆర్
దేశంలోని దళితుల కోసమే కొత్త రాజ్యాంగం కావాలంటున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. దేశమంతా దళితబంధు అమలు చేయాలని, దీనికోసమే కొత్త రాజ్యాంగం రాయాలని కోరుతున్నానని, దీనిని దళిత సంఘాలు వద్దంటాయా? అని ప్రశ్నించారు. దళిత సంఘాలకు, రాజ్యాంగానికి ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం, ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కోసం కొత్త రాజ్యాంగం రావాలని కోరుతున్నానని తెలిపారు.

భారతదేశం అమెరికా కన్నా గొప్ప ఆర్థికశక్తిగా ఎదిగేందుకు కొత్త చట్టం, కొత్త స్ఫూర్తి రావాలని సీఎం కేసీఆర్ అభిలషించారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది... దీన్ని అడ్డుకునేందుకు కొత్త రాజ్యాంగం రాయాలి అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలా భారతదేశం కూడా మారాలన్న ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నానని స్పష్టం చేశారు.

ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరిహద్దుల్లో డ్రామాలు చేస్తుంటారని, ఈ తరహా రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అసోం సీఎం వ్యాఖ్యల నేపథ్యంలోనే తాను రాహుల్ గాంధీ విషయం మాట్లాడానని, తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదని కేసీఆర్ స్పష్టం చేశారు.


More Telugu News