ఉక్రెయిన్ సరిహద్దులకు భారీగా రష్యా దళాలు... శాటిలైట్ చిత్రాల్లో వెల్లడి

  • ఉక్రెయిన్ పై యుద్ధ మేఘాలు
  • సరిహద్దుల్లో భారీ మోహరింపులు
  • అమెరికా విజ్ఞప్తులు బుట్టదాఖలు
  • విన్యాసాలు చేపట్టిన రష్యా సైన్యం
ఉక్రెయిన్ పై యుద్ధ మేఘాలు ముసురుకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా విజ్ఞప్తులను కూడా పట్టించుకోకుండా రష్యా కదనోత్సాహంతో తన దళాలను భారీగా ఉక్రెయిన్ సరిహద్దులకు తరలిస్తోంది. తాజాగా వెల్లడైన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఆ విషయం స్పష్టమైంది. పశ్చిమ రష్యా, బెలారస్, క్రిమియా ప్రాంతాల్లో రష్యా బలగాలు మోహరించిన దృశ్యాలు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది.

కొన్నిరోజుల ముందు కంటే ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో సైనిక మోహరింపులు పెరిగినట్టు తెలిసింది. వాడుకలో లేని వైమానిక స్థావరాలను కూడా రష్యా బలగాలు పునరుద్ధరిస్తున్నాయి. సింఫెర్ పోల్ ప్రాంతంలో మూతపడిన ఓ ఎయిర్ ఫీల్డ్ లో 550కి పైగా సైనిక గుడారాలు వెలిశాయి. ఒక్తియాబ్రస్కోయే ఎయిర్ ఫీల్డ్ లోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి.

వ్యూహాత్మక డొనుజ్లోవ్ సరస్సు సమీపంలోని నోవూజెర్నాయే వద్ద రష్యా బలగాలు సైనిక విన్యాసాలు చేపట్టాయి. ఇక్కడ భారీ ఎత్తున ఆయుధ సామగ్రి మోహరించారు. అంతేకాదు, క్రిమియా సమీపంలోని స్లావ్నే పట్టణం వద్ద కూడా రష్యా బలగాలు స్థావరాలు ఏర్పరచుకున్న విషయం శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది.


More Telugu News