ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ కోసం చివరి వరకు పోరాడిన సన్ రైజర్స్... రూ.8 కోట్లతో ఎగరేసుకెళ్లిన ముంబయి

  • ఆర్చర్ కోసం వేలంలో హోరాహోరీ
  • ప్రధానంగా సన్ రైజర్స్, ముంబయి మధ్య పోటీ
  • ఆర్చర్ ను సొంతం చేసుకున్న ముంబయి
ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలంలో ఇవాళ కూడా పలువురు ఆటగాళ్లకు భారీ ధర పలికింది. ఇంగ్లండ్ స్పీడ్ స్టర్ జోఫ్రా ఆర్చర్ కోసం ఫ్రాంచైజీలు నువ్వానేనా అనే రీతిలో పోటీపడ్డాయి. చివరికి ఆర్చర్ ను ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది.

ఆర్చర్ కోసం ప్రధానంగా సన్ రైజర్స్, ముంబయి ఇండియన్స్ హోరాహోరీ పోరాడాయి. సన్ రైజర్స్ చివరి వరకు ఆర్చర్ ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించింది. అయితే ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.8 కోట్లతో ఆర్చర్ ను కొనుగోలు చేసింది. ఆర్చర్ అత్యంత వేగంగా బౌలింగ్ చేయడమే కాదు, భారీ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేయగలడు.

ఇక, నేటి వేలంలో వెస్టిండీస్ క్రికెటర్ రొమారియో షెపర్డ్ అనూహ్యరీతిలో రూ.7.75 కోట్లు కొల్లగొట్టాడు. రొమారియో షెపర్డ్ ను సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. 27 ఏళ్ల రొమారియో ఆల్ రౌండర్. ఇప్పటివరకు 10 వన్డేలు ఆడి 8 వికెట్లు తీశాడు. 14 టీ20ల్లో 12 వికెట్లు సాధించాడు. టీ20ల్లో అతడి బ్యాటింగ్ స్ట్రయిక్ రేటు 160.27. కరీబియన్ క్రికెట్లో మంచి ఫినిషర్ గా గుర్తింపు పొందాడు. అయితే, ప్రపంచ క్రికెట్లో అతడి గురించి తెలిసింది తక్కువే అయినా, ఐపీఎల్ ద్వారా అతడి ప్రతిభ అందరికీ తెలియనుంది.


More Telugu News