ఈసారి మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ పుట్టినరోజు సంబరాలు... కేటీఆర్ పిలుపు
- ఈ నెల 17న కేసీఆర్ పుట్టినరోజు
- 15వ తేదీ నుంచే సంబరాలు
- అన్నదానాలు, రక్తదానాలు, సేవాకార్యక్రమాలకు కేటీఆర్ పిలుపు
ఫిబ్రవరి 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. అయితే, ఈసారి కేసీఆర్ పుట్టినరోజు సంబరాలు మూడు రోజుల పాటు నిర్వహించాలని మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత మన సీఎం కేసీఆర్ జన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించుకుందామని తెలిపారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు.
ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు వంటి చోట్ల పండ్లు, ఆహారం, దుస్తుల పంపిణీ చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదానం చేయాలని తెలిపారు. కేసీఆర్ పుట్టినరోజైన 17వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవే కాకుండా, ఈ మూడు రోజుల పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు వ్యక్తిగతంగా తమకు తోచిన విధంగా 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా ఎలాంటి సేవా కార్యక్రమాన్నయినా చేపట్టవచ్చని తెలిపారు.