సీఎం జగన్ కు 'మోసకార్' అవార్డు ఇవ్వాల్సిందే!: అచ్చెన్నాయుడు
- మరోసారి ప్రత్యేక హోదా రగడ
- అజెండా నుంచి హోదా అంశం తొలగింపు
- భగ్గుమంటున్న విపక్షాలు
- సీఎం జగన్ ఆస్కార్ ను మించి నటిస్తున్నారన్న అచ్చెన్న
ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర హోంశాఖ నిన్న ఉభయ రాష్ట్రాల సమావేశం అజెండాలో తొలుత ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి, ఆపై ఆ అంశాన్ని తొలగిస్తూ మరో అజెండా రూపొందించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఆస్కార్ అవార్డుకు మించి నటిస్తున్నారని, అందుకే ఆయనక 'మోసకార్' అవార్డు తప్పక ఇవ్వాలని వ్యంగ్యం ప్రదర్శించారు.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పెయిడ్ ఆర్టిస్టులతో ప్రత్యేకహోదా అంటూ డ్రామాలు ఆడింది ఎవరు? ఇప్పుడెందుకు నోరు మెదపడంలేదు? అంటూ అచ్చెన్న మండిపడ్డారు. జగన్ ప్రత్యేక హోదా అంశంలో ఎందుకు కిమ్మనడంలేదో తెలిసిన విషయమే అని, తన కేసుల మాఫీ కోసం 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను అమ్మేశాడని ఆరోపించారు. తాడేపల్లి నుంచి ఢిల్లీ వరకు ఎక్కడా ప్రత్యేక హోదా మాట వినిపించకుండా నిషేధం విధించారని విమర్శించారు.
విభజన అంశాలపై నియమించిన ఉప కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి, మళ్లీ తొలగించడం వైసీపీ అసమర్థతకు నిదర్శనమని, వైసీపీ నేతల లోపాయికారీతనం దీంతో బట్టబయలైందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.