హిజాబ్ ఎందుకు ధరించలేదని అమ్మాయిపై ట్రోలింగ్
- జమ్మూకశ్మీర్‌కు చెందిన అరూసా పర్వేజ్
- పన్నెండో తరగతిలో 500కు 499 మార్కులు
- ఈ విషయాన్ని తెలుపుతూ ఫొటో పోస్ట్
- ఫొటోలో హిజాబ్ ధరించకపోవడంతో ట్రోలింగ్
కర్ణాటక నుంచి దేశం మొత్తం వ్యాప్తి చెందుతోంది హిజాబ్ వివాదం. తాజాగా, ఓ చదువుల తల్లి, జమ్మూకశ్మీర్‌కు చెందిన అరూసా పర్వేజ్ అనే విద్యార్థిని హిజాబ్ ధరించుకుండా ఫేస్‌బుక్‌లో తన ఫొటో పోస్ట్ చేయడంతో ఆమెపై ట్రోల్ చేస్తుండడం గమనార్హం. జమ్మూకశ్మీర్ బోర్డు పరీక్షల్లో ఆమె పన్నెండో తరగతిలో టాపర్‌గా నిలిచింది. సైన్స్, కామర్స్, హోం సైన్స్ వంటి సబ్జెక్టుల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చింది.ఆమెకు 500 మార్కులకు 499 మార్కులు వచ్చాయి. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసింది.
పరీక్షల ఫలితాలు వచ్చిన అనంతరం స్థానిక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది. అయితే, ఆ ఇంటర్వ్యూలో హిజాబ్ ధరించలేదన్న విషయాన్ని గుర్తించిన కొందరు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కర్ణాటకలో హిజాబ్ కోసం మనవాళ్లు పోరాడుతుంటే నువ్వు మాత్రం ఇలా చేస్తావా? అంటూ ఆమెను అవమానించేలా పోస్టులు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.