ఎప్పుడూ ఆలోచిద్దాం అనేవాడు కాస్తా ఓకే అనేశాడు.. ఆరోజు విష్ణు నో అని ఉంటే నేనూ నో చెప్పేవాడిని: మోహన్ బాబు

  • ‘సన్ ఆఫ్ ఇండియా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కామెంట్స్
  • విష్ణునే స్వయంగా లోగో డిజైన్ చేసి పంపాడని వెల్లడి
  • ఈ నెల 18న విడుదల కానున్న సినిమా
తమ కుటుంబానికి సినిమానే ఊపిరి అని మంచు మోహన్ బాబు అన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పొట్ట చేతబట్టుకుని వచ్చి నటుడిగా, నిర్మాతగా సంపాదించుకుని ఇంతవాడినయ్యానన్నారు. సంపాదించిన దాంట్లో కొంత విద్యాసంస్థలకు ఖర్చు పెట్టి తోచినంతలో కొందరికి ఉచిత విద్యనందిస్తున్నానన్నారు. ఆయన నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా ఈనెల 18న విడుదల కానుండడంతో నిన్న నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు.

సినిమా అంటేనే రిస్క్ అన్నారు. డైమండ్ రత్నబాబు కలిసి కథ చెప్పగానే సినిమాను ఓకే చేశానని తెలిపారు. వెంటనే విష్ణుకు ఫోన్ చేసి సన్ ఆఫ్ ఇండియా సినిమా చేయాలనుకుంటున్నట్టు చెబితే ఓకే అనేశాడని చెప్పారు. మామూలుగా అయితే ‘ఆలోచిద్దాం’ అని చెప్పే విష్ణు.. ఈ సినిమా గురించి చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఓకే అన్నాడని, లోగో కూడా డిజైన్ చేసి పంపించాడని గుర్తు చేశారు. ఒకవేళ విష్ణుగానీ నో అని ఉంటే ఈ సినిమా చేసే వాడినే కాదని మోహన్ బాబు అన్నారు.

కాగా, అప్పట్లో సుందర్ అనే ఒక టాప్ రచయిత 50 దాకా కథలు చెప్పారని, అందులో తనకేదీ నచ్చలేదని గుర్తు చేశారు. చివరగా ఒకే ఒక్క కథ చెప్పమని అడగడంతో.. ఆయనోకథ వినిపించారని, అది బాగా నచ్చేసిందని తెలిపారు. అయితే, అప్పటికే ఆ కథతో కన్నడలో వచ్చని సినిమా ఫ్లాప్ అయిందని ఆయన చెప్పినా.. మేము రిస్క్ చేసి ముందుకే వెళ్లి హిట్ కొట్టామన్నారు. రిస్క్ చేయాలని తాను నమ్ముతుంటానని చెప్పారు. 


More Telugu News