అల్లు అర్జున్ మేనియా మామూలుగా లేదు.. 'పుష్ప' చీరలు వైరల్.. వీడియో ఇదిగో
- గుజరాత్‌లో పుష్ప దృశ్యాలతో చీరలు
- దేశ వ్యాప్తంగా వ్యాపారికి పేరు వచ్చిన వైనం
- భారీగా ఆర్డర్లు వస్తున్నాయన్న వ్యాపారి
దేశ వ్యాప్తంగా 'పుష్ప' రాజ్ మేనియా ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. ఈ సినిమాలోని పాటలు, డైలాగులకు దేశ వ్యాప్తంగా ఎంత పాప్యులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. పుష్ప పోస్టర్లను ట్రాఫిక్ పోలీసులూ వాడుకున్నారు. 'తగ్గేదే లే' అంటూ బన్నీ చెప్పిన డైలాగులతో ఫొటోలను వాడుకుని ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నిబంధనలు పాటించాలని సూచించారు.
అలాగే, ఇప్పుడు వ్యాపారులు కూడా పుష్పకు ఉన్న క్రేజ్ ను వాడుకుంటున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పుష్ప చీరలు వైరల్ అవుతున్నాయి. పుష్ప సినిమాలోని దృశ్యాలను చీరలపై ప్రింట్ చేసి అమ్ముతున్నారు. గుజరాత్ లోని సూరత్ క్లాత్ మార్కెట్ లో చరణ్ పాల్ సింగ్ వ్యాపారి ఆ సినిమా పోస్టర్లను పోలిన చీరలు తయారు చేయించారు.
ఆ సినిమాలోని సన్నివేశాలు, ఫోటోలను చీరపై చూపించారు. ఈ విషయం తెలుసుకున్న మహిళలు ఆ చీరలను చూస్తూ భారీగా ఆర్డర్డు ఇస్తున్నారట. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ చీరలకు భారీగా ఆర్డర్డు వచ్చాయని ఆ వ్యాపారి చెప్పాడు. పుష్ప చీరలు రూపొందించి ఆ వ్యాపారి దేశ వ్యాప్తంగా పాప్యులారిటీ సంపాదించుకున్నాడు. దీంతో ఆయనతో పలు చానెళ్లు ఇంటర్వ్యూలు సైతం చేస్తున్నాయి. పుష్ప సినిమా వల్ల సినీ పరిశ్రమనే కాకుండా ఇతర పరిశ్రమలు కూడా బాగుపడుతున్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.