కొన్ని షరతులతో పాదయాత్రలు, ర్యాలీలకు పర్మిషన్ ఇచ్చిన ఎన్నికల కమిషన్

  • కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలను సడలించిన ఈసీ
  • పాదయాత్రలు, ర్యాలీలకు జిల్లా అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలని సూచన
  • ప్రచార సమయాన్ని కూడా పెంచిన ఈసీ
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో పాదయాత్రలు, ర్యాలీలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా కేసులు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. దీంతో, అన్ని రంగాలు  మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతిని ఇచ్చింది. అయితే వీటికి జిల్లా అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలని షరతు విధించింది. అంతేకాదు పరిమిత సంఖ్యలోనే పాదయాత్రలు, ర్యాలీలు ఉండాలని తెలిపింది.

ప్రచార సమయంపై కూడా ఈసీ ఆంక్షలను సడలించింది. ప్రచారం సమయాన్ని పెంచుతున్నట్టు ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేసుకోవడానికి అనుమతించింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.


More Telugu News