ఆంధ్రా వికెట్ కీపర్ ను రూ.2 కోట్లతో కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
- బెంగళూరులో ఐపీఎల్ వేలం
- ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కేఎస్ భరత్
- రాహుల్ తెవాటియాకు రూ.9 కోట్లు
- కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో మరికొన్ని కొనుగోళ్లు జరిగాయి. ఆంధ్రా రంజీ సారథి, టీమిండియా ఆటగాడు కేఎస్ భరత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కేఎస్ భరత్ కు వేలంలో రూ.2 కోట్ల ధర పలికింది. కేఎస్ భరత్ గతేడాది చివరి బంతికి సిక్సర్ కొట్టి ఆర్సీబీని గెలిపించడంతో ఐపీఎల్ లో ఒక్కసారిగా క్రేజ్ వచ్చింది. భరత్ ఈసారి వేలంలో ఢిల్లీ సొంతమయ్యాడు. గత సీజన్ లో భరత్ కు లభించిన మొత్తం కేవలం రూ.20 లక్షలే.
ఇక దక్షిణాఫ్రికా యువ సంచలనం, జూనియర్ ఏబీ డివిలియర్స్ గా క్రికెట్ పండితులు పిలుస్తున్న డివాల్డ్ బ్రెవిస్ కు ఐపీఎల్ వేలంలో రూ.3 కోట్ల ధర లభించింది. ఈ అండర్-19 క్రికెటర్ ను ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. సీనియర్ డివిలియర్స్ లాగే మైదానంలో అన్ని మూలలకు షాట్లు కొట్టగల సత్తా బ్రెవిస్ సొంతం.
ఇతర ఆటగాళ్లకు లభించిన ధరలు ఇవిగో...

- రాహుల్ తెవాటియా- రూ.9 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- శివం మావి- రూ.7.25 కోట్లు (కోల్ కతా నైట్ రైడర్స్)
- కార్తీక్ త్యాగి- రూ.4 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
- హర్ ప్రీత్ బ్రార్-రూ.3.8 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- అనుజ్ రావత్- రూ.3.4 కోట్లు (ఆర్సీబీ)
- షాబాజ్ అహ్మద్-రూ.2.4 కోట్లు (ఆర్సీబీ)
- కమలేశ్ నాగర్ కోటి- రూ.1.10 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)