తెలంగాణలో కొత్తగా 683 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 52,714 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 168 కొత్త కేసులు
  • ఇంకా 13,674 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 52,714 శాంపిల్స్ పరీక్షించగా, 683 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 168 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 53, నల్గొండ జిల్లాలో 46, రంగారెడ్డి జిల్లాలో 44 కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,645 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో ఎలాంటి మరణాలు సంభవించలేదు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,83,019 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,65,239 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,674 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా 4,106 మంది కరోనాతో మరణించారు.


More Telugu News