కొడాలి నాని విష ప్రచారం చేస్తున్నారు: బొండా ఉమ ఫైర్
- కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్ పేరు
- దాన్ని టీడీపీ అడ్డుకుంటోందని అంటున్నారు
- దమ్ముంటే ఆధారాలు చూపాలి
- అశోక్‌బాబును అర్ధరాత్రి అరెస్టు చేశారు
- కేసినో నిర్వహించిన నానిపై మాత్రం చర్యల్లేవన్న ఉమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీపై మంత్రి కొడాలి నాని విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే టీడీపీ అడ్డుకుంటోందని ఆయన అంటున్నారని, దమ్ముంటే దానికి ఆధారాలు చూపాలని చాలెంజ్ చేశారు.
అసలు కొడాలి నానికి ఆయన శాఖపై కనీస అవగాహన ఉందా? అని ఉమ నిలదీశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రంలో నిరసనలు జరుగుతుంటే జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.
అర్ధరాత్రి సమయంలో తమ ఎమ్మెల్సీ అశోక్ బాబును అరెస్ట్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. గుడివాడలో కేసినో నిర్వహించి, అమ్మాయిలతో డ్యాన్స్ చేయించిన నానిపై ఇప్పటివరకు కేసు పెట్టలేదని చెప్పారు. దీనిపై రాష్ట్ర డీజీపీ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. కమీషన్ల కోసం విశాఖలో అదానీకి వేల కోట్ల రూపాయల ఆస్తులు అప్పచెప్పారని ఆయన ఆరోపించారు. అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని, ఇందుకు గాను వైసీపీ సర్కారు గిన్నిస్ రికార్డు సాధిస్తుందని ఉమ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని వైసీపీ అప్పుల ఊబిలోకి లాగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.