నలుగురి కడుపు నింపే కొత్త చాలెంజ్ ను తీసుకొచ్చిన ప్రముఖ వ్యాపార వేత్త హర్ష గోయెంకా
- హలో హ్యాపీనెస్ చాలెంజ్ విసిరిన ఆర్పీజ గ్రూప్ చైర్మన్
- ఆనంద క్షణాలను పంచుకుంటే వారి తరఫున అభాగ్యులకు భోజనం పంపిస్తామని ట్వీట్
- పేటీఎం బాస్ కు సవాల్
- స్పందించిన ప్రముఖులు
ఈ మధ్య సోషల్ మీడియాలో ‘చాలెంజ్’లు ఎక్కువైపోతున్నాయి. చాలా మంది ప్రాణాంతకమైన స్టంట్లతోనూ చాలెంజ్ లు విసురుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జనానికి ఉపయోగపడే చాలెంజ్ లు చేసేవాళ్లు చాలా తక్కువైపోయారు.
ఆ క్రమంలోనే తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ ‘గ్రీన్ చాలెంజ్’ పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది ఎంతగా ప్రాముఖ్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా నలుగురి కడుపు నింపే మరో మంచి చాలెంజ్ ను తీసుకొచ్చారు.
‘హలో హ్యాపీనెస్ (#HelloHappiness)’ పేరిట చాలెంజ్ ను విసిరారు. ఎవరైనా ఆ హాష్ ట్యాగ్ తో సంతోష క్షణాలను పంచుకుంటే.. వారి తరఫున ఆర్పీజీ గ్రూప్ నుంచి ఆకలితో అలమటించేవారి కోసం ఓ భోజనం పంపించనున్నారు. ఈ చాలెంజ్ ద్వారా అభాగ్యుల కడుపు నింపనున్నారు. ఈ మేరకు పేటీఎం అధిపతి విజయ్ శేఖర శర్మకు ఆయన తొలి సవాల్ విసిరారు.
‘‘విజయ్ శేఖర్.. నేనో హ్యాపీనెస్ చెయిన్ ను ప్రారంభిస్తున్నాను. ఓ ఆనంద క్షణాన్ని పంచుకోవాలని ఆహ్వానిస్తున్నా. ఇంకా చాలా మంది ఈ చెయిన్ లో భాగస్వాములయ్యేలా చొరవ తీసుకోండి. ఆనంద క్షణాలను పంచుకునే ప్రతి ఒక్కరూ #HelloHappiness #TweetAMeal అనే హాష్ ట్యాగ్ లను జోడించండి. అలా చేసే ప్రతి ట్వీట్ కూ ఆర్పీజీ ఫౌండేషన్ ఫీడ్ ఇండియా నుంచి భోజనం పంపిస్తాం. బీచ్ లో సరదాగా నడవడం నా ఆనంద క్షణం’’ అని హర్ష గోయెంకా ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ చాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. చాలా మంది ఆయన స్టార్ట్ చేసిన ఈ సత్కార్యాన్ని మెచ్చుకుంటున్నారు. హర్ష గోయెంకా చాలెంజ్ కు స్పందించిన విజయ్ శేఖర శర్మ.. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు కృతజ్ఞతలు అని తెలిపారు. ప్రపంచంలోని వివిధ నగరాల్లో సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం తన ఆనంద క్షణమంటూ ఫొటోలు పోస్ట్ చేశారు. కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా, సినీ నటుడు రితేశ్ దేశ్ ముఖ్, సింగర్ అద్నాన్ సమీ, క్రికెటర్ అజింక్యా రహానేలు హలో హ్యాపీనెస్ చాలెంజ్ ను స్వీకరించారు.