మేము గెలిస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి: ఉత్తరాఖండ్ సీఎం

  • ఇందుకోసం కమిటీని నియమిస్తాం
  • అందరికీ సమాన హక్కులు
  • సామాజిక మత సామరస్యం ఏర్పడుతుంది
  • మహిళల సాధికారత బలోపేతం అవుతుందన్న సీఎం  
ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉమ్మడి పౌర చట్టం అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి ముసాయిదా రూపొందించేందుకు కమిటీని నియమిస్తామని చెప్పారు.

  ‘‘వివాహం, విడాకులు, ఆస్తులు, వారసత్వం విషయంలో అన్ని మతాల వారికి ఉమ్మడి పౌర స్మృతి కింద ఒకటే చట్టం అమలవుతుంది. వారి మత విశ్వాసాలతో సంబంధం ఉండదు’’ అంటూ ధామి ట్వీట్ చేశారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉమ్మడి పౌర నియమావళిని వీలైనంత ముందుగా అమలు చేస్తే.. రాష్ట్రంలోని అందరికీ ఒకే విధమైన హక్కులు లభిస్తాయని ధామి అన్నారు. ‘‘ఇది సామాజిక సామరస్యానికి దారితీస్తుంది. లింగ పరమైన న్యాయానికి మద్దతునిస్తుంది. మహిళా సాధికారతను బలోపేతం చేస్తుంది. రాష్ట్రానికి సంబంధించి విశిష్టమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక గుర్తింపును కాపాడుతుంది’’ అని ధామి తెలిపారు.


More Telugu News