అధికార పక్షం ఎన్ని కుట్రలు చేసినా ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటాం: లోకేశ్
- ఉక్కు కార్మికులకు ఉద్యమాభివందనాలు
- పార్లమెంటు వరకు పార్టీ నిరసన గళం
- ఉక్కుపై వైసీపీ ఎంపీలు మాట్లాడట్లేరదన్న లోకేశ్
ఏపీలోని విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమై నేటితో ఏడాది అవుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకూ పోరాటం ఆపేది లేదని ప్రకటించిన కార్మికులు అదే స్ఫూర్తితో నేటికీ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.
పోరాటానికి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ... విశాఖ ఉక్కు కార్మికులకు ఉద్యమాభివందనాలు చేస్తున్నానని చెప్పారు. ఈ విషయంపై పార్లమెంటు వరకు తమ పార్టీ నిరసన గళం వినిపిస్తూనే ఉందని తెలిపారు. విశాఖ ఉక్కుపై వైసీపీ ఎంపీలు మాట్లాడట్లేదని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని తెలిపారు.