మూడు రోజుల క్రితమే పెళ్లి సంబంధం చూశారు.. తుపాకీ మిస్ ఫైర్ అయి కానిస్టేబుల్ మృతి!
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం
- కాచనపల్లి పీఎస్ లో తుపాకీ పేలి కానిస్టేబుల్ సంతోష్ మృతి
- మృతుడిది వరంగల్ జిల్లా గవిచర్ల గ్రామం
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొమరారం పరిధి కాచనపల్లి పోలీస్ స్టేషన్ లో తుపాకీ మిస్ ఫైర్ అయి కానిస్టేబుల్ మృతి చెందారు. ఆయుధాలను పరిశీలిస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడు సంతోష్ ది వరంగల్ జిల్లా గవిచర్ల గ్రామం. మరో దారుణ విషయం ఏమిటంటే... మూడు రోజుల క్రితమే సంతోష్ కి పెళ్లి సంబంధం చూశారు. ఇంతలోనే ఈ దారుణం సంభవించింది. సంతోష్ మృతి వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు.