'రంగరంగ వైభవంగా' రిలీజ్ డేట్ ఖరారు!

  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'రంగరంగ వైభవంగా'
  • వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
  • మే 27వ తేదీన విడుదల
తొలి సినిమా 'ఉప్పెన'తో భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్, యూత్ నుంచి .. మాస్ ఆడియన్స్ నుంచి కూడా మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత సందేశాత్మక చిత్రమైన 'కొండపొలం' సినిమాలోను నటుడిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. మూడో సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ కావాలనే ఉద్దేశంతో 'రంగరంగ వైభవంగా' చేస్తున్నాడు.

టైటిల్ తోనే ఇది లవ్ తో ముడిపడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయం తెలిసిపోతోంది. 'అర్జున్ రెడ్డి'ని తమిళంలో రీమేక్ చేసిన గిరీశాయ ఈ సినిమాకి దర్శకుడు. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. మే 27వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ బాణీలను సమకూర్చాడు.

ఈ సినిమాలో కేతిక శర్మ అందాల సందడి చేయనుంది .. కెరియర్ పరంగా ఇది ఆమెకి మూడో సినిమా. ఇంతకుముందు చేసిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, గ్లామర్ పరంగా మంచి క్రేజ్ ను కొట్టేసింది. ఈ సినిమాతో తాను ఇక్కడ బిజీ అవుతాననే నమ్మకంతో ఆమె ఉంది. 


More Telugu News