వెస్టిండీస్ పై మూడో వన్డేలోనూ టీమిండియా విజయం... సిరీస్ క్లీన్ స్వీప్
- అహ్మదాబాద్ లో చివరి వన్డే
- విండీస్ టార్గెట్ 266 రన్స్
- 169 పరుగులకు ఆలౌటైన విండీస్
- చెరో మూడు వికెట్లు తీసిన సిరాజ్, ప్రసిద్ధ్
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు వెస్టిండీస్ పై వన్డే సిరీస్ లో తిరుగులేని ఆధిపత్యం కనబర్చింది. చివరి వన్డేలోనూ టీమిండియానే విజయం వరించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో రోహిత్ సేన 96 పరుగుల తేడాతో వెస్టిండీస్ ను ఓడించింది.
266 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3, ప్రసిద్ధ్ కృష్ణ 3, దీపక్ చహర్ 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లతో రాణించారు. విండీస్ జట్టులో ఓడియన్ స్మిత్ అత్యధికంగా 36 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్ లో విజయంతో టీమిండియా వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక, ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ లోని అన్ని మ్యాచ్ లు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్నాయి. తొలిమ్యాచ్ ఈ నెల 16న జరగనుంది.