అవయవదానం చేస్తున్నట్టు ప్రకటించిన సినీ నటుడు జగపతిబాబు
- రేపు జగపతిబాబు పుట్టినరోజు
- నేడు కిమ్స్ ఆసుపత్రిలో అవయవదాన సదస్సు
- ముఖ్య అతిథిగా జగపతిబాబు
- నిజ జీవితంలోనూ హీరో అవుతానని వెల్లడి
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు రేపు (ఫిబ్రవరి 12) పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవదానం చేస్తున్నట్టు నేడు ఆయన ఓ ప్రకటన చేశారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అవయవదాన అవగాహన సదస్సుకు జగపతిబాబు చీఫ్ గెస్టుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవయవదానం చేయడం వల్ల రియల్ లైఫ్ లోనూ హీరోగా మారొచ్చని అన్నారు. మనిషి చనిపోయిన తర్వాత బూడిద తప్ప ఇంకేమీ మిగలదని, కానీ అవయవదానం చేయడం వల్ల ఏడెనిమిది మందికి పునర్జన్మ కలిగించిన వాళ్లం అవుతామని అభిప్రాయపడ్డారు. అసలు, అవయదానం చేసినవాళ్లకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ప్రకటించాలని సూచించారు.