ఎమ్మెల్సీ అశోక్ బాబును విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించిన అధికారులు
- నకిలీ సర్టిఫికెట్, ఫోర్జరీ ఆరోపణలు
- అశోక్ బాబును అరెస్ట్ చేసిన సీఐడీ
- సీఐడీ జడ్జి ఎదుట హాజరుపర్చనున్న అధికారులు
- అశోక్ బాబుకు కొవిడ్ పరీక్షలు
ఫోర్జరీ చేసిన తప్పుడు సర్టిఫికెట్ తో ఉద్యోగ పదోన్నతి పొందారన్న ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో అధికారులు అశోక్ బాబును విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఆయనను సీఐడీ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నారు. దాంతో జడ్జి నివాసంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు, గత 17 గంటలుగా అశోక్ బాబు గుంటూరు సీఐడీ కార్యాలయంలోనే ఉన్నారు. అక్కడే ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆయనకు ర్యాపిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చింది.